icon icon icon
icon icon icon

అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు

అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నేతలు పోలీసు జీపుల్లో డబ్బులు తరలించి ఎన్నికల్లో గెలిచారని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ పూర్తయితే అధికార దుర్వినియోగంతో గెలిచిన జనగామ ఎమ్మెల్యే పల్లా సహా మరో 30 మంది భారాస ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Apr 2024 04:17 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జనగామ, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నేతలు పోలీసు జీపుల్లో డబ్బులు తరలించి ఎన్నికల్లో గెలిచారని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ పూర్తయితే అధికార దుర్వినియోగంతో గెలిచిన జనగామ ఎమ్మెల్యే పల్లా సహా మరో 30 మంది భారాస ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనగామ అంబేడ్కర్‌ చౌరస్తాలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికలతో తెలంగాణలో భారాస కనుమరుగవుతుందని, మద్యం కుంభకోణంలో కవిత తిహాడ్‌ జైలులో ఉన్నారని, కాళేశ్వరం విచారణ పూర్తయితే కేసీఆర్‌, హరీశ్‌రావులు జైలుకెళ్లడం తప్పదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజలకు అందించిన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు సీహెచ్‌ రాజారెడ్డి, కొమ్మూరి ప్రశాంత్‌, డాక్టర్‌ రాజమౌళి, నియోజకవర్గ సమన్వయకర్త భవానీరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img