icon icon icon
icon icon icon

శత్రువును కూడా అభినందించాలనే.. ఈటలను గెలుస్తున్నావన్నా

‘‘శుభకార్యంలో ఒకరికొకరం ఎదురు పడ్డాం.. గతంలో కలిసి పనిచేశాం.. శత్రువైనా అభినందించాలని అనుకున్నా.. అందుకే మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో నువ్వు గెలుస్తున్నావు అని చెప్పా.

Published : 28 Apr 2024 04:17 IST

నేను తుమ్మినా తుపానే అన్నట్లుగా ఉంది: మల్లారెడ్డి

నాగారం, న్యూస్‌టుడే: ‘‘శుభకార్యంలో ఒకరికొకరం ఎదురు పడ్డాం.. గతంలో కలిసి పనిచేశాం.. శత్రువైనా అభినందించాలని అనుకున్నా.. అందుకే మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో నువ్వు గెలుస్తున్నావు అని చెప్పా. గతంలో కూడా నాపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వజ్రేష్‌ యాదవ్‌ను కూడా నువ్వు గెలుస్తున్నావన్నా.. అన్నంత మాత్రాన ఆయన గెలవలేదు.. ఇది కూడా అంతే’’ అని మేడ్చల్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మేడ్చల్‌ జిల్లా నాగారం, దమ్మాయిగూడ పురపాలికల భారాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం ఈటలపై చేసిన వ్యాఖ్యల గురించి స్పష్టత ఇచ్చారు. ‘నేను ఏది మాట్లాడినా సంచలనంగా మీడియా ప్రచారం చేస్తోంది.. మల్కాజిగిరి భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమైంది. ఇతర పార్టీలకు మారిన వారు.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. వీరితో మాట్లాడితే వారికి కోపం.. వారితో మాట్లాడితే వీరికి కోపం అన్నట్లుగా మారింది. నేను తుమ్మినా తుపానే అన్నట్లుగా ఉంది. భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులను తూర్పు నుంచి ఒకరిని, పడమర నుంచి ఒకరిని తెచ్చుకున్నాయి. ఈటల రాజేందర్‌ కోడిగుడ్ల వ్యాపారంతో కోట్లు సంపాదించారు’ అని అన్నారు. భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు అనుకోకుండా అవకాశం వచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రాముడైతే.. తాను లక్ష్మణుడిగా పనిచేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img