icon icon icon
icon icon icon

సీఎం రేవంత్‌ నుంచి రాజీనామా పత్రం తీసుకురా

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హుజూరాబాద్‌ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 04:17 IST

మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాల్‌

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హుజూరాబాద్‌ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు నుంచి మీరు కోరుతున్న ఫార్మాట్‌ ప్రకారం రాజీనామా పత్రం తీసుకొచ్చే బాధ్యత తనదని, అదే ఫార్మాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి రాజీనామా పత్రం తెచ్చే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి తీసుకుంటారా? ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామాపత్రాన్ని కూడా అమరుల స్తూపం వద్ద పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తామని హరీశ్‌రావు అన్నారని, వాటిని ప్రజల పక్షాన అడిగారని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సభల్లో చెబుతున్నారని, వాటిని ఎక్కడ అమలు చేశారో ప్రజలే ఆలోచించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img