icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో చేరిన భారాస నేత కోనేరు చిన్ని

కొత్తగూడెం భారాస నేత కోనేరు చిన్ని(సత్యనారాయణ) హస్తం పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన సోదరుడు కోనేరు పూర్ణచందరరావు, పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా వేసుకొన్నారు.

Published : 28 Apr 2024 04:18 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కొత్తగూడెం భారాస నేత కోనేరు చిన్ని(సత్యనారాయణ) హస్తం పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన సోదరుడు కోనేరు పూర్ణచందరరావు, పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా వేసుకొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా చిన్ని కీలకపాత్ర పోషిస్తున్నారు. తెదేపా భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం భాజపా జిల్లా అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాసలో చేరారు. కొద్దిరోజులుగా ఆయన భారాస నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img