icon icon icon
icon icon icon

‘ఎక్స్‌’లో ఖాతా తెరిచిన కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శనివారం ఖాతా తెరిచారు. అందులో మొదటి పోస్టుగా భారాస ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన తరువాత విద్యుత్‌ కోతలపై పోస్ట్‌ పెట్టారు.

Published : 28 Apr 2024 04:19 IST

విద్యుత్‌ కోతలపై పోస్టు

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శనివారం ఖాతా తెరిచారు. అందులో మొదటి పోస్టుగా భారాస ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన తరువాత విద్యుత్‌ కోతలపై పోస్ట్‌ పెట్టారు. ‘తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయింది. ప్రతి రోజూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది ? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.


కరెంటు కోతలు లేవు
- మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యుత్‌ ఎస్‌ఈ వివరణ

మహబూబ్‌నగర్‌ పట్టణంలో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నివాసం ఉన్న ప్రాంతంలో ఎలాంటి విద్యుత్‌ కోతలు లేవని మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీరు(ఎస్‌ఈ) ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటికి విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలోనూ ఎలాంటి కోతలు నమోదు కాలేదని చెప్పారు. ఆ ప్రాంతంలోని సబ్‌స్టేషన్‌లోనూ కోతలేవీ నమోదు కాలేదని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img