icon icon icon
icon icon icon

రూ.104 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 29 Apr 2024 05:29 IST

పోలీసుశాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఈ నెల 28 వరకూ జరిపిన తనిఖీల్లో ఈ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు 477 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 89 చెక్‌ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 464 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకూ రూ.63,41,66,697 నగదు, రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన మత్తుమందులు, రూ.21.34 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.6.91 కోట్ల విలువైన చీరలు, కుక్కర్ల వంటి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 7,174 లైసెన్సు ఉన్నవి, 14 లైసెన్సు లేని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటితోపాటు 50 పెట్టెల్లో 2,502 గిలెటిన్‌ స్టిక్కులు, 371 డిటొనేటర్లతోపాటు పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img