icon icon icon
icon icon icon

భాజపాను గెలిపించే పనిలో భారాస

భాజపా, భారాస ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నాయని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఆదివారం మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా అమీన్‌పూర్‌ పురపాలక పరిధిలో ఆమె ప్రచారం చేశారు.

Published : 29 Apr 2024 03:18 IST

మంత్రి కొండా సురేఖ విమర్శ

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: భాజపా, భారాస ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నాయని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఆదివారం మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా అమీన్‌పూర్‌ పురపాలక పరిధిలో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాజపాను గెలిపించడానికి భారాస పని చేస్తోందన్నారు. మెదక్‌కు సంబంధం లేని భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఇక్కడ గెలిచేందుకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన వద్ద డబ్బులు తీసుకున్నా.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే ఓటేయాలని పేర్కొన్నారు. అంతకు ముందు అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారాస కౌన్సిలర్లు మల్లేశం, యూసఫ్‌ఖాన్‌ కాంగ్రెస్‌లో చేరగా.. మంత్రి కండువా వేసి ఆహ్వానించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, బీరంగూడ ఆలయ కమిటీ ఛైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img