icon icon icon
icon icon icon

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు జైలుకెళ్లడం ఖాయం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె తిహాడ్‌ జైల్లో ఉన్నారని.. కాళేశ్వరం, ధరణి కుంభకోణం, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా ఊచలు లెక్కపెట్టక తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 29 Apr 2024 03:20 IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె తిహాడ్‌ జైల్లో ఉన్నారని.. కాళేశ్వరం, ధరణి కుంభకోణం, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా ఊచలు లెక్కపెట్టక తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారాసకు చెందిన ఆరుగురు పురపాలిక కౌన్సిలర్లు, కార్యకర్తలు ఆయన సమక్షంలో ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన ఫోన్‌ ట్యాపింగ్‌ను.. మొన్నటి శాసనసభ ఎన్నికల వరకు కొనసాగించారన్నారు. వారు దోచుకున్న రూ.లక్షల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని చెప్పారు. అవినీతిలో భాగస్వాములై రాష్ట్రాన్ని దోచుకున్నది ఎంతటి వారైనా చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని.. స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img