icon icon icon
icon icon icon

అబద్ధాలను నమ్మించడంలో కేసీఆర్‌ ప్రొఫెసర్‌: జగ్గారెడ్డి

అబద్ధాలు చెప్పి.. అవే నిజాలని నమ్మించడంలో, లేనిది ఉన్నట్టు చెప్పడంలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రొఫెసర్‌ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు.

Published : 29 Apr 2024 03:21 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అబద్ధాలు చెప్పి.. అవే నిజాలని నమ్మించడంలో, లేనిది ఉన్నట్టు చెప్పడంలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రొఫెసర్‌ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ మత్స్య విభాగం ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం వారి స్థితిగతుల గురించి కూడా పట్టించుకోలేదు. అధికారం పోగానే ప్రజలు, వారి సమస్యలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ప్రచారం చేయకపోతే పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస కనుమరుగవుతుందనే భయంతోనే ప్రజలపై కపట ప్రేమ కనబరుస్తున్నారు. కేసీఆర్‌ మంచి రాజకీయ నటుడు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అదే అబ్బింది. భారాస ఎన్ని ఎంపీ సీట్లు గెలిచినా భాజపాకే మద్దతిస్తుంది. కానీ కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు’’ అని జగ్గారెడ్డి చెప్పారు.


కాంగ్రెస్‌కు ఓటేస్తేనే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం

-వీహెచ్‌

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తేనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామనడంతో భాజపా నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇండియా కూటమి గెలిస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వీహెచ్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img