icon icon icon
icon icon icon

భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు

భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతోపాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హైదరాబాద్‌ పార్లమెంటు మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

Published : 29 Apr 2024 03:22 IST

అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణ

చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, న్యూస్‌టుడే: భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతోపాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హైదరాబాద్‌ పార్లమెంటు మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం చార్మినార్‌ నియోజకవర్గంలోని మొఘల్‌పురలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘సర్కారు విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని ప్రధాని మోదీ ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ చట్టాలు అమల్లోకి తెచ్చి ముస్లింలను అణచివేయాలని చూస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఎవరి మతాచారాల ప్రకారం వారి పిల్లలకు పెళ్లిళ్లు చేయడం కుదరదు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. భాజపా ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగాయని దుయ్యబట్టారు. ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని జై శ్రీరాం అనే పదంతో నింపితే 50 శాతం మార్కులతో పాస్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో భాజపాతోపాటు ఇతర పార్టీలకు రూ.వేల కోట్ల విరాళాలు అందాయి. మజ్లిస్‌ పార్టీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img