icon icon icon
icon icon icon

లోక్‌సభ బరిలో 525 మంది

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వంద మంది నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.

Updated : 30 Apr 2024 22:25 IST

అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 12 మంది పోటీ
100 మంది నామినేషన్ల ఉపసంహరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వంద మంది నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజిగిరిలో 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో ఒకే ఒక్క అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు.

2019 కన్నా పెరిగిన అభ్యర్థులు

గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా 893 మంది వేశారు. గడిచిన ఎన్నికల్లో 142 మంది నామినేషన్లు తిరస్కారానికి గురైతే ఈ దఫా ఆ సంఖ్య 268కు పెరిగింది. గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి వంద మందికి చేరింది. గతంలో 443 మంది తుది పోటీలో ఉంటే ఈ దఫా 82 మంది పెరిగారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజామాబాద్‌ జిల్లాలో రైతులు అధికంగా పసుపు పండిస్తారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ రైతులు భారీగా పోటీలో నిలవడంతో అభ్యర్థుల సంఖ్య 185కు చేరింది. దీంతో పసుపు రైతుల గోడు వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img