icon icon icon
icon icon icon

భాజపాపై పోరాటం చేస్తున్నందుకే నోటీసులు

భాజపాపై పోరాటం చేసేవారికి అమిత్‌షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై కర్ణాటకలోని సేడంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన స్పందించారు.

Updated : 30 Apr 2024 22:27 IST

భయపడేది లేదు: రేవంత్‌రెడ్డి

భాజపాపై పోరాటం చేసేవారికి అమిత్‌షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై కర్ణాటకలోని సేడంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన స్పందించారు. ‘‘ఎన్నికల్లో గెలిచేందుకు తన ప్రత్యర్థులపై మోదీ ఇంతకాలం ఈడీ, సీబీఐలను ప్రయోగించారు. ఇప్పుడు దిల్లీ పోలీసులను వినియోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమంలో ఏదో పోస్ట్‌ చేశారన్న నెపంతో నాపై దిల్లీ పోలీసులను పంపారు. వారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని, తెలంగాణ సీఎంను అరెస్టు చేస్తామంటున్నారు. నోటీసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. వారికి ప్రజలే సమాధానం చెబుతారు’’ అని రేవంత్‌ అన్నారు. కాగా, నోటీసులకు సమాధానం ఇవ్వడానికి 15 రోజుల గడువు కోరినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేతలు నకిలీ వార్తలు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నారని.. వారిపై కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటామని హస్తం పార్టీ హెచ్చరించింది. నకిలీ వార్తలను కాంగ్రెస్‌ వ్యాప్తి చేయదని, అది భాజపా చేసే పని అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రతిష్ఠకు భాజపా భంగం కలిగించిందని, దానిపై దర్యాప్తు జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img