icon icon icon
icon icon icon

కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు మాధవీలత

బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భాజపా హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి కె.మాధవీలత సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 30 Apr 2024 22:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భాజపా హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి కె.మాధవీలత సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, విల్లును ఎక్కుపెట్టానంటూ ఏప్రిల్‌ 20న నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా భక్తులు నిర్వహించిన యాత్రలో పాల్గొని  శ్రీరాముడి వలె విల్లు పట్టుకుని పోజు ఇచ్చానని.. అది నేరం కాదని తెలిపారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, ఎలాంటి నినాదాలు, ప్రసంగాలు చేయలేదన్నారు. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని, పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img