icon icon icon
icon icon icon

సీఎం, కాంగ్రెస్‌ నేతలకు నోటీసులను ఖండిస్తున్నాం

అమిత్‌షా ఫేక్‌ వీడియో పేరుతో సీఎం రేవంత్‌రెడ్డికి, ఇతర కాంగ్రెస్‌ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌, ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఖండించారు.

Updated : 30 Apr 2024 22:42 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అమిత్‌షా ఫేక్‌ వీడియో పేరుతో సీఎం రేవంత్‌రెడ్డికి, ఇతర కాంగ్రెస్‌ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌, ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో నష్టం జరుగుతుందనే భయంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లు రిజర్వేషన్లు ఉండాలని, తాము వ్యతిరేకం కాదంటూ మాట మార్చారని విమర్శించారు. వారు సోమవారం గాంధీభవన్‌లో విడివిడిగా మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని గ్రహించిన భాజపా.. కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి పన్నిన పెద్ద కుట్రలో భాగమే నోటీసులని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img