icon icon icon
icon icon icon

ప్రజలతో ముచ్చటించి.. కాఫీ తాగి..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సుయాత్రలో భాగంగా సోమవారం వరంగల్‌ నుంచి ఖమ్మం వెళ్తూ దారిలో ఒక హోటల్‌ వద్ద ఆగి స్థానికులతో ముచ్చటించారు.

Updated : 30 Apr 2024 22:41 IST

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సుయాత్రలో భాగంగా సోమవారం వరంగల్‌ నుంచి ఖమ్మం వెళ్తూ దారిలో ఒక హోటల్‌ వద్ద ఆగి స్థానికులతో ముచ్చటించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్జేజీతండాలోని జాతీయ రహదారిపై సయ్యద్‌ సోందుకు చెందిన హోటల్‌ వద్ద ఆయన రాత్రి ఏడు గంటల సమయంలో ఆగారు. కేసీఆర్‌ను గమనించిన ప్రజలు ఒక్కసారిగా హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ఆయన వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హోటల్‌లో మిరపకాయ బజ్జీలు రుచి చూశారు. కాఫీ చేయించుకుని తాగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ కేసీఆర్‌ వెంట ఉన్నారు.

మరిపెడ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img