icon icon icon
icon icon icon

తనిఖీల్లో రూ.202 కోట్ల సొత్తు స్వాధీనం

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.202,52,23,146 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated : 30 Apr 2024 22:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.202,52,23,146 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో వివిధ దర్యాప్తు సంస్థలు నిర్వహించిన తనిఖీల్లో రూ.76,65,90,171 నగదు, రూ.43,57,80,119 విలువైన మద్యం, రూ.26,11,80,044 విలువైన మత్తుమందులు, రూ.29,62,24,254 విలువైన వెండి, బంగారం, రూ.26,54,48,558 విలువైన చీరలు, కుక్కర్ల వంటి ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img