icon icon icon
icon icon icon

అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ ముఖ్యనేతలు, లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యులు, ఇతర నేతలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.

Updated : 30 Apr 2024 22:38 IST

పకడ్బందీగా ప్రచారం కీలకం
పార్టీ నేతలకు నడ్డా దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ ముఖ్యనేతలు, లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యులు, ఇతర నేతలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీకి అసెంబ్లీ సీట్ల కంటే లోక్‌సభ స్థానాలు ఎక్కువ వస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదాసీనతకు అవకాశం లేకుండా  పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు, లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా తాజా పరిస్థితిని సమీక్షించారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఉద్బోధించారు. పోలింగ్‌ శాతాన్ని పెంచాలని మధ్యాహ్నం 12 గంటలలోపే గరిష్ఠంగా ఓటింగ్‌ జరిగేలా చూడాలని సూచించారు.  కేంద్రం చేపట్టిన అభివృద్ది పథకాలు, కార్యక్రమాలను వివరించడంతో పాటు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. యువత పూర్తిస్థాయి మద్దతు మోదీకి ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌, భారాసలు భాజపాపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్‌, తమిళిసై తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img