icon icon icon
icon icon icon

మాదిగలపై రేవంత్‌రెడ్డి సర్జికల్‌ స్ట్రైక్స్‌: మోత్కుపల్లి

‘ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ప్రధాని మోదీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.. కానీ రాష్ట్రంలో కళ్ల ముందే రేవంత్‌రెడ్డి మాదిగలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారు.

Updated : 30 Apr 2024 22:28 IST

మే 5 నుంచి ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర: మంద కృష్ణమాదిగ

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ప్రధాని మోదీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.. కానీ రాష్ట్రంలో కళ్ల ముందే రేవంత్‌రెడ్డి మాదిగలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వుడ్‌ పార్లమెంటు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల్లో ఒక్క మాదిగకు కూడా అవకాశమివ్వకపోవడమే అందుకు నిదర్శనం’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. మాదిగలకు కాంగ్రెస్‌ చేసిన ద్రోహానికి నిరసనగా మే 4న హైదరాబాద్‌లో ధర్నా గానీ, దీక్ష గానీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మే 5 నుంచి మాదిగల ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img