icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో భువనగిరి నాయకుల చేరికలు నిలిపివేత

భువనగిరికి చెందిన పలువురు నాయకుల చేరికలపై అక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ చేరికలను పార్టీ నిలిపివేసింది.

Updated : 30 Apr 2024 22:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: భువనగిరికి చెందిన పలువురు నాయకుల చేరికలపై అక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ చేరికలను పార్టీ నిలిపివేసింది. భువనగిరి నియోజకవర్గానికి చెందిన గోడ శ్రీనివాస్‌ గౌడ్‌, రాహుల్‌ గౌడ్‌, చిన్నం శ్రీనివాస్‌లను చేర్చుకోవడంపై అభ్యంతరాలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సూచనల మేరకు చేరికలను నిలిపివేసినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img