icon icon icon
icon icon icon

తెలంగాణకు భాజపా ఏమీ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ బల్మూరి

తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన ‘తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చింది’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated : 30 Apr 2024 22:39 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన ‘తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చింది’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, మీడియా కమిటీ ఛైర్మన్‌, సామ రాంమోహన్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యానర్‌పై తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన అంశాలను రాశారు. దాని ముందు గుడ్డును పోలిన ఆకారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. మేడారం జాతర, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి అనేక అంశాలను అడిగితే భాజపా ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. దీనికి కిషన్‌రెడ్డి, సంజయ్‌, ఈటల, జవాబివ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img