icon icon icon
icon icon icon

ప్రజలను విభజించేందుకు మోదీ కుట్ర: ఒవైసీ

ఓటమి భయంతో ప్రజలను విభజించేందుకు ప్రధాని మోదీ భారీ కుట్ర పన్నుతున్నారని అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారంటూ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Updated : 30 Apr 2024 22:50 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ఓటమి భయంతో ప్రజలను విభజించేందుకు ప్రధాని మోదీ భారీ కుట్ర పన్నుతున్నారని అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారంటూ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజార్టీగా ఉండరని, వారి పట్ల ఈ భయాన్ని మరెంత కాలం కొనసాగిస్తారంటూ మోదీని ప్రశ్నించారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని, వారే ఎక్కువగా గర్భ నిరోధక సాధనాలు వాడుతున్నారన్న విషయం చెప్పేందుకు తాను సిగ్గుపడనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సభల్లో అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img