icon icon icon
icon icon icon

సీఎం రేవంత్‌ను అరెస్టు చేయగలరా?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాటలు వక్రీకరించారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించిన భాజపా, అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.

Published : 01 May 2024 03:05 IST

భాజపాకు మంత్రి పొన్నం సవాల్‌

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాటలు వక్రీకరించారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించిన భాజపా, అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి దమ్ముంటే అరెస్టు చేసి చూపించాలని సవాల్‌ విసిరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్యా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీలపై వందల సంఖ్యలో ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భాజపా 400 సీట్లలో గెలిపించాలని అడుగుతోందని, మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించడం తథ్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. దేవుడి ఫొటోతో ఓట్లు అడగడం మానేసి, అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడగాలని భాజపా నేతలకు మంత్రి హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img