icon icon icon
icon icon icon

మోదీ, అమిత్‌ షాలకు ఈసీ తాఖీదులివ్వాలి: కె.నారాయణ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాజపాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే తట్టుకోలేని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు ఆయన్ని నియంత్రించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ అన్నారు.

Published : 01 May 2024 03:06 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాజపాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే తట్టుకోలేని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు ఆయన్ని నియంత్రించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ అన్నారు. ఏవేవో సాకులు చూపిస్తూ రేవంత్‌కు దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి బదులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిద్దరికి ఎన్నికల కమిషన్‌ నోటీసులు ఇవ్వాలని అన్నారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌ను జైలులో పెట్టేందుకు మోదీ అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్‌షా బహిరంగంగానే చెబుతున్నారు. ఇండియా కూటమి గెలిస్తే ఆస్తులను, స్త్రీల మంగళ సూత్రాలను స్వాధీనం చేసుకుంటారనే వ్యాఖ్యలతో మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా వ్యతిరేకించిన కేజ్రీవాల్‌, రేవంత్‌రెడ్డి ఇతరులు దేశద్రోహులా? కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పదేళ్లుగా బెయిల్‌పై ఉంటారా? ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను సజావుగా నిర్వహించాలి. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో భాజపా ఎదగడానికి భారాసనే కారణం’’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img