icon icon icon
icon icon icon

మాకు గడువు ఇవ్వండి

ఫేక్‌ వీడియో వైరల్‌ అంశంపై విచారణకు హాజరు కావడానికి తమకు కొంత గడువు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి విన్నవించారు.

Published : 01 May 2024 03:43 IST

దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి కాంగ్రెస్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ఫేక్‌ వీడియో వైరల్‌ అంశంపై విచారణకు హాజరు కావడానికి తమకు కొంత గడువు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి విన్నవించారు. బుధవారం(ఈ నెల ఒకటిన) విచారణకు రావాలని దిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం గాంధీభవన్‌కు వచ్చి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కోఆర్డినేటర్‌ నవీన్‌, రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు నోటీసులిచ్చారు. వీటిపై కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయవాదులు మంగళవారం చర్చించి పార్టీ సూచన మేరకు వినతిపత్రం పంపారు. ఎన్నిరోజులు గడువు ఇస్తారనేది దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం స్పందన  తరవాత తెలుస్తుందని లీగల్‌సెల్‌ విభాగం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img