icon icon icon
icon icon icon

సీఎంకు దిల్లీ పోలీసుల నోటీసు.. కక్ష సాధింపు

సీఎం రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం భాజపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 01 May 2024 03:44 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం భాజపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. భాజపా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నకిలీ వీడియో తయారు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు పంపుతున్నారని, ముఖ్యమంత్రికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్‌ ప్రశ్నించారు. నోటీసులకు, భాజపా బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img