icon icon icon
icon icon icon

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకూడదనే రేవంత్‌కు సమన్లు: కాంగ్రెస్‌

తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు కలిగించడమేనని కాంగ్రెస్‌ పేర్కొంది.

Published : 01 May 2024 03:45 IST

దిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు కలిగించడమేనని కాంగ్రెస్‌ పేర్కొంది. తమ పార్టీ విజయావకాశాలను రేవంత్‌ దెబ్బతీస్తారేమోనని ప్రధాని మోదీ భయపడుతున్నారా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. భాజపాను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నేతలు పోస్టులు పెట్టగానే.. వారి ఇళ్లపైకి పోలీసులను ప్రధాని మోదీ పంపుతున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఫేక్‌ వీడియోలు సృష్టించి, ప్రచారం చేస్తున్న భాజపాపై మాత్రం దిల్లీ పోలీసులు స్పందించడం లేదని.. ఇది ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఇస్తామన్న నిధులు ఏవని, నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏదని భాజపాను ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img