icon icon icon
icon icon icon

భాజపా పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని భాజపా ఖూనీ చేస్తోందని, లౌకికవాదాన్ని పాతిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.

Updated : 01 May 2024 05:47 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ప్రజాస్వామ్యాన్ని భాజపా ఖూనీ చేస్తోందని, లౌకికవాదాన్ని పాతిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. డంబాచారాలతో అబద్ధాలను వల్లెవేస్తూ మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీని వదిలించుకోకపోతే దేశానికి భవిష్యత్తే లేదన్నారు. భాజపాను చిత్తుగా ఓడించాలని, లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారిని, అలాంటి వారి కోసం పనిచేసేవారిని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, డీజీ నరసింహారావులతో కలిసి ‘బీజేపీ బందిఖానా నుంచి దేశాన్ని విముక్తి చేద్దాం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మోదీ ప్రజల భావోద్వేగాలను, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా మూడోసారి గెలవాలనుకుంటున్నారు. ఆయన పదేళ్ల పాలన అధ్వానం. అవినీతి, నిరుద్యోగం పెరిగి దేశంలో చదువుకున్న వారిలో 20 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మళ్లీ అధికారం ఇస్తే మోదీ మళ్లీ నల్లచట్టాలను తెస్తారు. ఈ తరుణంలో సీపీఎం చూపే ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలకు వివరించాలి. భాజపా బండారాన్ని బయటపెట్టేందుకు తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలి. భువనగిరిలో సీపీఎం అభ్యర్థిని, ఏపీలోనూ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎంను గెలిపించాలి’’ అని రాఘవులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img