icon icon icon
icon icon icon

అంబేడ్కర్‌ రాజ్యాంగానికి భాజపా, ఆరెస్సెస్‌ వ్యతిరేకం

ఆరెస్సెస్‌, భాజపాల ఎజెండా ఒకటేనని.. వాటికి రిజర్వేషన్లు ఇష్టం ఉండవని సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు గురుదీప్‌ సింగ్‌ సప్పల్‌ విమర్శించారు.

Published : 01 May 2024 03:52 IST

సీడబ్ల్యూసీ శాశ్వతసభ్యుడు గురుదీప్‌సింగ్‌ సప్పల్‌ ఆరోపణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆరెస్సెస్‌, భాజపాల ఎజెండా ఒకటేనని.. వాటికి రిజర్వేషన్లు ఇష్టం ఉండవని సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు గురుదీప్‌ సింగ్‌ సప్పల్‌ విమర్శించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రద్దు చేసి.. మనుస్మృతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైౖర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతాపాల్‌, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రాంమోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భాజపా 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ఆరెస్సెస్‌ శ్వేతపత్రంలో.. రాజ్యాంగం హిందూ వ్యతిరేకంగా ఉందని, దాన్ని మార్చాలని రాసి ఉంది. అందరికీ సమాన హక్కులు ఉండటం ఆరెస్సెస్‌కు నచ్చదు. దేశంలో 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుందని నియామకాలు చేపట్టడం లేదు. అందుకే ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్మీని కూడా ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి. ఇందుకోసం ఒక కమిషన్‌ నియమించాలని కోర్టు చెప్పినా మోదీ కుట్రపూరితంగా అమలు చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img