icon icon icon
icon icon icon

మోదీపై ‘కోడ్‌’ ఉల్లంఘన చర్యలు తీసుకోండి: ఈసీఐకి

మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 01 May 2024 03:52 IST

కాంగ్రెస్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు మంగళవారం పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ లేఖ రాశారు. ప్రధాని ప్రసంగం ప్రజల మధ్య కుల, మత విభేదాలు సృష్టించేలా ఉందని ఆక్షేపించారు. దీనిపై మెదక్‌ జిల్లా ఎన్నికల అధికారి నుండి నివేదిక కోరి మోదీపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే అది దేశంలో అరాచకానికి దారి తీస్తుందని నిరంజన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img