icon icon icon
icon icon icon

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతోపాటు దాని మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అఖిల భారత సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 03:56 IST

నేటి నుంచి 11 వరకు బస్సుయాత్ర: సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌

నల్లకుంట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతోపాటు దాని మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అఖిల భారత సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా పార్టీల ఓటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక(టీఎస్‌డీఎఫ్‌), తెలంగాణ జాగో సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా సర్కారు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా.. అయోధ్య రాముడు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), మైనార్టీలపై దాడులు.. తదితర భావోద్వేగపూరిత అంశాలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆరోపించారు. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా కూటమిని ఈ దఫా ఎన్నికల్లో బలపరచాలని ప్రజలను కోరారు. సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రాంచందర్‌, కె.రమ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సూర్యం, ఎస్‌.ఎల్‌.పద్మ, ఎం.హన్మేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img