icon icon icon
icon icon icon

మోదీ విద్వేష ప్రసంగం.. రేవంత్‌రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్‌కు వినిపించవా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న బూతులు ఎన్నికల కమిషన్‌కు వినిపించవా అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Published : 02 May 2024 02:53 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

కొండపాక గ్రామీణం, చిన్నకోడూర్‌, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న బూతులు ఎన్నికల కమిషన్‌కు వినిపించవా అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేయడంతోనే కేసీఆర్‌ను 48 గంటలు ప్రచారం చేయొద్దని ఆపారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మతో కలసి బుధవారం రాత్రి హరీశ్‌రావు రోడ్‌షో, ర్యాలీ నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తుంటే కాంగ్రెస్‌, భాజపా నాయకులు గజగజ వణుకుతున్నారు. కేసీఆర్‌ లాంటి గొప్ప వ్యక్తిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం తగునా? కేసీఆర్‌ను అంటే అందరినీ అన్నట్టే.. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేదా.. జిల్లాలు ఏర్పాటయ్యేవా? వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఈ నెల 13న జరిగే ఎన్నికలు ఓట్లు, సీట్లు అధికారం కోసం జరిగేవి కావు. తెలంగాణ భవిష్యత్తు కోసమే’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img