icon icon icon
icon icon icon

భాజపాకు వ్యతిరేకంగా బస్సు యాత్ర: జస్టిస్‌ చంద్రకుమార్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సంయుక్తంగా  చేపట్టిన బస్సు యాత్రను జాగో తెలంగాణ ఛైర్మన్‌, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

Published : 02 May 2024 02:54 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సంయుక్తంగా  చేపట్టిన బస్సు యాత్రను జాగో తెలంగాణ ఛైర్మన్‌, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు చుట్టేలా ఈ నెల 11 వరకు యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. రాజ్యాంగాన్ని బహిరంగంగా అపహాస్యం చేస్తున్న భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు. లౌకిక భావాలు ఉన్న నాయకులను ఎన్నుకోవాలని కోరారు. జాగో తెలంగాణ కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ..డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ రాష్ట్రాల్లో అల్లకల్లోలాలు సృష్టించిన     భాజపాకు ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక అన్వేష్‌, ప్రొ.లక్ష్మీనారాయణ, ప్రొ.పద్మజాషా, బీడీఎఫ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర తొలి రోజు మొయినాబాద్‌, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, సదాశివపేటల్లో సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img