icon icon icon
icon icon icon

4న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష

రిజర్వేషన్ల విషయంలో భాజపా వైఖరికి నిరసనగా ఈ నెల 4వ తేదీన భారత రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 02 May 2024 02:54 IST

మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రిజర్వేషన్ల విషయంలో భాజపా వైఖరికి నిరసనగా ఈ నెల 4వ తేదీన భారత రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ దళిత నేతలు ప్రీతం, గజ్జెల కాంతం, సతీశ్‌ మాదిగలతో కలిసి ఆయన బుధవారం రాత్రి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4న దీక్ష 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద లేదా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష జరుగుతుందని, ఈ రెండు చోట్ల అనుమతి లభించకపోతే గాంధీభవన్‌లో దీక్ష చేపడతామని తెలిపారు. అంతకు ముందు దళిత నేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌లతో గాంధీభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మాదిగలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలి: ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

మాదిగలందరూ అమ్ముడుపోయే నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయకులు మాదిగల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img