icon icon icon
icon icon icon

తెలంగాణకు భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’

కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Published : 02 May 2024 02:55 IST

ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం ఇచ్చింది.. ‘గాడిద గుడ్డు’ అని విమర్శించారు. ‘‘పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా,  రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయహోదా అడిగితే.. పదేళ్ల మోదీ పాలనలో కేంద్రం ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు...’’ అని రేవంత్‌రెడ్డి పోస్ట్‌ చేశారు. తెలంగాణ అభివృద్ధికి భాజపానే అడ్డని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img