icon icon icon
icon icon icon

రాహుల్‌, ప్రియాంకాగాంధీల ప్రచార షెడ్యూల్‌ ఖరారు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలతో పాటు ఇతర ముఖ్యనేతలు మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు.

Published : 02 May 2024 02:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలతో పాటు ఇతర ముఖ్యనేతలు మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. రాహుల్‌ గాంధీ ఈ నెల 5న నిర్మల్‌, గద్వాల్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 9న కరీంనగర్‌, సరూర్‌నగర్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కరీంనగర్‌, చేవెళ్ల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రియాంక ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూర్‌, సికింద్రాబాద్‌లలో ప్రచార సభలకు హాజరుకానున్నారు. 7న నర్సాపూర్‌, కూకట్‌పల్లిల్లో ప్రచారం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img