icon icon icon
icon icon icon

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్‌

ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విలువలు పాటించడంలేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 02 May 2024 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విలువలు పాటించడంలేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అబద్ధాలతో భాజపాపై బురదజల్లాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఫేక్‌ వీడియోల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను మార్ఫింగ్‌ చేయడం వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు. అబద్ధపు విష ప్రచారం వల్లే ప్రజలు మోసపోయి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని గెలిపించారనన్నారు. రాజకీయంగా, విద్య, ఉద్యోగ అంశాల్లో బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడం ఖాయమన్నారు. కాళేశ్వరంపై విచారణలో మెతకవైఖరి ఎందుకని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img