icon icon icon
icon icon icon

మోదీ సర్కారును గద్దె దింపే వరకు విశ్రమించొద్దు: కె.నారాయణ

కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోదీ సర్కారును గద్దె దింపేవరకు కార్మికలోకం విశ్రమించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ పిలుపునిచ్చారు.

Published : 02 May 2024 02:58 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోదీ సర్కారును గద్దె దింపేవరకు కార్మికలోకం విశ్రమించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్‌ కూడలి వరకు, అక్కడి నుంచి తిరిగి కార్యాలయం వరకు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని.. 40 చట్టాలను నాలుగు కోడ్‌లుగా చేశారన్నారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. అరెస్టు చేస్తే రేవంత్‌ ప్రతిష్ఠ మరింత పెరిగి.. మోదీ ప్రతిష్ఠ దిగజారుతుందని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలు, కార్మికులు తమలోని ఆగ్రహాన్ని, నిరసనను ఎన్నికల సమయంలో ఓటు హక్కు రూపంలో చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు ఎస్‌.బాలరాజ్‌, ఉజ్జిని రత్నాకర్‌రావు, ఈ.టి.నరసింహ, కె.శ్రీనివాస్‌, పల్లె నరసింహ, కమతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img