icon icon icon
icon icon icon

అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్న మోదీ: మంత్రి పొంగులేటి

అయోధ్య రామయ్య పేరుతో ప్రధాని మోదీ నాలుగు   అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Published : 02 May 2024 02:59 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: అయోధ్య రామయ్య పేరుతో ప్రధాని మోదీ నాలుగు   అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎంకేసీఆర్‌ తెలంగాణలో ఓడిపోయి కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని ప్రకటించడం భారాస, భాజపాల మధ్య అవగాహనకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు మిగిలిఉన్న అన్ని హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని   లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img