icon icon icon
icon icon icon

8న రాష్ట్రానికి మోదీ

భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Updated : 03 May 2024 06:04 IST

10న ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభ
5న అమిత్‌షా.. 6న నడ్డా రాక

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకారం.. ప్రధాని మోదీ 8న ఉదయం 9 గంటలకు కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని వేములవాడ, అదే రోజు 10.30కు వరంగల్‌ స్థానం పరిధిలోని మడికొండ బహిరంగసభలలో ప్రసంగిస్తారు. 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అగ్రనేత అమిత్‌షా 5న ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, మధ్యాహ్నం 1.30కు నిజామాబాద్‌, సాయంత్రం మల్కాజిగిరిలో బహిరంగ సభలకు హాజరవుతారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 6న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి, మధ్యాహ్నం ఒంటిగంటకు భువనగిరి, 3.30కు నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img