icon icon icon
icon icon icon

ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి

ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 03 May 2024 04:48 IST

 మంత్రి తుమ్మల వ్యాఖ్య

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీపీఐ, సీపీఎంలతో తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సీపీఐ ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు.

17 స్థానాలూ కాంగ్రెస్‌కే: పొంగులేటి

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 17 స్థానాలూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపాతో భారాస పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. కేంద్రంలో నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కేసీఆర్‌ చెబుతున్నారని, భాజపాతో పొత్తు లేకుండా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌ కలిసి పనిచేసి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, కేంద్రంలో సైతం అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు.

మోదీ దిగజారుడుతనానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం: నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. అంబానీ, అదానీ తదితర 24 మంది కార్పొరేట్‌ శక్తుల కోసమే కేంద్రంలోని మోదీ సర్కారు పనిచేస్తోందని దుయ్యబట్టారు. 400 సీట్లలో భాజపా గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మంగళం పాడతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళసూత్రాలను ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ చెప్పటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో భారాసకు కాలం చెల్లిందని అన్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్‌ను బలపరుస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img