icon icon icon
icon icon icon

సంజయ్‌కి ఓటమి భయం పట్టుకుంది

కరీంనగర్‌ భాజపా పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ధ్వజమెత్తారు.

Published : 03 May 2024 04:49 IST

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ భాజపా పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి మచ్చలేని తనపై మాట్లాడే అర్హత సంజయ్‌కి లేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఉన్న ప్రభాకర్‌రావు అమెరికా నుంచి డబ్బు పంపిస్తే.. తాను వాటిని దిల్లీకి తీసుకెళ్లి ఇస్తే టికెట్‌ వచ్చిందనడాన్ని ఖండించారు. అసలు టికెట్‌ ఏ కోణంలో తనకు ఇచ్చారనే విషయం తెలుసుకోకుండా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రభాకర్‌రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బంధువని చెప్పడం సరైనది కాదని రాజేందర్‌రావు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img