icon icon icon
icon icon icon

మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి

‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

Published : 03 May 2024 04:52 IST

తెజస అధ్యక్షుడు కోదండరాం
టీపీజేఏసీ ఆధ్వర్యంలో ప్రచారోద్యమం

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ప్రచారోద్యమ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. దేశంలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 162 మంది బిలియనీర్ల వద్ద 40% దేశ సంపద ఉందని, 70 కోట్ల మంది ప్రజల వద్ద 15% సంపద మాత్రమే ఉందని పేర్కొన్నారు. టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ రమా మేల్కొటే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు శతాబ్దాల కాలంగా మతసామరస్యంతో జీవిస్తున్నారని, ఈ వాతావరణాన్ని భాజపా నేతలు చెడగొట్టి విద్వేషం నింపుతున్నారని ఆరోపించారు. టీపీజేఏసీ కో-కన్వీనర్లు కన్నెగంటి రవి, రవిచంద్ర, మైస శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ నాయకురాలు కవిత కురుగంటి, డాక్టర్‌ వనమాల, ప్రొఫెసర్‌ సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img