icon icon icon
icon icon icon

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు.

Published : 03 May 2024 04:54 IST

జమ్మికుంట, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. ‘నాడు సుభిక్షం-నేడు సంక్షోభం’ అని పేర్కొంటూ.. పలు పథకాలపై జమ్మికుంటలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ‘జన జాతర’ సభలో ప్రజలు అడగాలని వీడియోను రిలీజ్‌ చేశారని పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేపై ఐపీసీ 504, 153ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img