icon icon icon
icon icon icon

కేజ్రీవాల్‌ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ చెప్పారు.

Published : 03 May 2024 06:20 IST

అహ్మదాబాద్‌, దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ చెప్పారు. ఆప్‌ తరఫున గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గురువారం అహ్మదాబాద్‌కు వచ్చిన ఆమె.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ను బలవంతంగా జైల్లోపెట్టారని, ఎన్నికల్లో ఆయన వాణి ప్రజలకు చేరకుండా చూడాలనేదే దీనివెనుక ఉద్దేశమని చెప్పారు. వివేకవంతులైన ప్రజలు తమ ఓటుతో స్పందిస్తారని పేర్కొన్నారు. ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ మాట్లాడుతూ- మతం ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని అనుమతించేది లేదని మోదీ ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. చేసిన పనుల ఆధారంగా ఓట్లు ఎందుకు అడగడం లేదన్నారు. పాకిస్థాన్‌కు అతిపెద్ద స్నేహితుడు మోదీయేనని ఎద్దేవా చేశారు.

దిల్లీలో సంతకాల సేకరణ

కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్‌ నాయకులు గురువారం దిల్లీలో సంతకాల సేకరణ ప్రారంభించారు. ప్రజలు సందేశాలు రాసేందుకు వీలుగా లజ్‌పత్‌నగర్‌లో రెండు తెల్లబోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలకు తమ సీఎంపై ఉన్న ప్రేమ గురించి భాజపాకు తెలియజేసేందుకు సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆప్‌ నేతలు చెప్పారు. ‘జైలుకు సమాధానం ఓటుతో ఇస్తాం’ వంటి నినాదాలను వారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img