icon icon icon
icon icon icon

అమిత్‌షాపై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలను అతిక్రమించి పిల్లలను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరో నలుగురు భాజపా నేతలపై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 04 May 2024 05:39 IST

మొఘల్‌పురా, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలను అతిక్రమించి పిల్లలను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరో నలుగురు భాజపా నేతలపై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల ఒకటో తేదీ రాత్రి లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం నుంచి సుధా థియేటర్‌ సమీపంలోని లైబ్రరీ వరకు జరిగిన భాజపా రోడ్‌షోలో అమిత్‌షా పాల్గొన్నారు. లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన సభావేదికపై అమిత్‌షా, హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలత, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పార్టీ నాయకుడు యమన్‌సింగ్‌లు పార్టీ గుర్తును ప్రదర్శించిన కొందరు పిల్లలతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినట్లు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ మెయిల్‌ ద్వారా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img