icon icon icon
icon icon icon

దిల్లీ పోలీసులతో అరెస్ట్‌కు యత్నం

దిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో ఉంటారని, వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

Published : 04 May 2024 05:40 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: దిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో ఉంటారని, వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్‌ను ముందస్తు ప్రణాళిక ప్రకారమే అరెస్టు చేశారన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ మతం పేరుతో మాట్లాడి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుండటం సరికాదన్నారు. ఏపీలో రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ వైఎస్‌ జగన్‌ పదేళ్లుగా కోర్టుకు వెళ్లకపోయినా ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. భారాస హయాంలో కేసీఆర్‌ ప్రతిపక్షం అనేది లేకుండా చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ అవినీతి, అహంకారంతో ఓటమి చెందారన్నారు. కేసీఆర్‌ కంటే జగన్‌ పది రెట్లు ఎక్కువ అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img