icon icon icon
icon icon icon

రాహుల్‌ నామినేషన్‌లో సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రాయ్‌బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్‌గాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు.

Updated : 04 May 2024 06:26 IST

హైదరాబాద్‌, బేగంపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రాయ్‌బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్‌గాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. అంతకుముందు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఖర్గేకు కాంగ్రెస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ధర్మపురి జనజాతర సభకు, సిరిసిల్ల సభకు హాజరయ్యారు. రాయ్‌బరేలికి అప్పటికప్పుడు వెళ్లడంతో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను కుదించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా అన్యాయం చేసిందని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ‘తాత.. నీకు టాటా’ పేరుతో శుక్రవారం ఓ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.

నేడు నాలుగు చోట్ల సీఎం ప్రచారం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట(మహబూబ్‌నగర్‌)కార్నర్‌ మీటింగ్‌, సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img