icon icon icon
icon icon icon

మోదీని గెలిపించాలి: తమిళిసై

దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు.

Published : 04 May 2024 05:40 IST

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. భాజపాకు ఓటేస్తే మోదీ ప్రధాని అవుతారని, కాంగ్రెస్‌లో ఎవరవుతారని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం రాత్రి వారాసిగూడ నుంచి నామాలగుండు, సీతాఫల్‌మండి, చిలకలగూడ మీదుగా అమర్‌ టాకీస్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు.  కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో తన వంతు కృషి చేశానన్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతూనే, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సినీనటుడు సాయికుమార్‌, నేతలు మేకల సారంగపాణి, రవిప్రసాద్‌గౌడ్‌, బండకార్తీక చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img