icon icon icon
icon icon icon

ప్రధానిపై తప్పుడు ఆరోపణలు

ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 04 May 2024 05:41 IST

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ గౌరవాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించాలన్నారు. శుక్రవారం ఆయన భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లలో భాజపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తే.. కేంద్రం ఇచ్చింది ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img