icon icon icon
icon icon icon

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రచారంలో ఉద్రిక్తత

భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 04 May 2024 06:24 IST

బల్మూర్‌ (అచ్చంపేట న్యూటౌన్‌), న్యూస్‌టుడే: భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి బల్మూర్‌లో రోడ్‌షో నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌, భారాస జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజులను అడ్డుకునేందుకు  రైతులు ప్రయత్నించారు. గో బ్యాక్‌ అంటూ గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2023లో ఉమామహేశ్వర ప్రాజెక్టుకు అసెంబ్లీలో తీర్మానం చేయించడమే కాకుండా, అచ్చంపేటలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారంటూ బాలరాజుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల ఆందోళనను గమనించిన భారాస కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భారాస అభ్యర్థిని గెలిపిస్తే భూనిర్వాసితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img